పర్యాటకుల అనుమతి నిలిపివేత
ఆదిలాబాద్, (విజయక్రాంతి): తనప్రకృతి అందాలతో ఎత్తైన కొండ నుండి జాలువారే సెలయేరులతో పర్యాటకులను కనువిందు చేసే కుంటాల జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేరేడిగొండ మండలం లోని కుంటల జలపాతంకు సోమవారం భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలపాతం కాస్త ఉగ్రరూపాన్ని తలపిస్తోంది. ఎప్పుడు ఎత్తైన కొండల నుండి జాలువారే నీటి ధారలతో పర్యాటకులను కనువిందు చేసే కుంటాల జలపాతం కాస్త వరద నీటి ఉధృతితో తన ఉగ్రరూపాన్ని తలపిస్తోంది. దీంతో అధికారులు ప్రయాణికులను కుంటాల జలపాతానికి అనుమతించడం లేదు.