బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల రైల్వే ట్రాక్ పై బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందిన నంది నరేష్ (30) అనే యువకుని అంత్యక్రియలను చంద్రవెల్లి గ్రామంలో గ్రామస్తులు నిర్వహించారు. గ్రామంలో సెంట్రింగ్ పని చేస్తూ జీవిస్తున్న నరేష్ కు బంధువులు ఎవరూ లేకపోవడంతో నాయకుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు చందాలు వేసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. అమాయకంగా, అందరితో కలివిడిగా ఉండే నరేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.