మంచిర్యాల జిల్లా బురదగూడెంలో ఘటన
మందమర్రి, సెప్టెంబర్ 24: భూ వివాదం కారణంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని బురదగూడెంలో అంత్యక్రియలు అడ్డుకున్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని బురదగూడెం గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్(30) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు.
బురదగూడెం నేతకాని కులస్థులు గత 80 ఏండ్ల నుంచి భూస్వామి మాధవరావుకు చెందిన మామిడి తోట సమీపంలోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తు న్నారు. నేతకాని కులానికి చెందిన శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు మంగళవారం వెళ్తుండగా పట్టణ గౌడ సంఘానికి చెందిన కొందరు ఆ స్థలంలో అంత్యక్రియలు చేయవద్దంటూ అడ్డుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న తహసీల్దార్ సతీష్, పట్టణ సీఐ శశిధర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడారు. మూ డు రోజుల్లో స్థల వివాదాన్ని తొలగిస్తామన్నారు. అంత్యక్రియలు యథావిధిగా నిర్వహించాలని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
కాగా ఇటీవల కాలంలో ఆ భూమి క బ్జాకు గురవుతుందని ప్రజావాణిలో గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. సోమవారం సైతం ఓ మహిళ మృతి చెందగా ఆమె అంత్యక్రియలను సైతం అడ్డుకున్నారు. పెద్దల జోక్యంతో అంత్యక్రియలు జరిగాయి.