29-04-2025 08:27:02 PM
దాతృత్వం చాటుకున్న చిరు వ్యాపారులు...
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో అనాధ వ్యక్తి అనారోగ్యంతో మరణించగా చిరు వ్యాపారులు ఏకమై అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించి దాతృత్వాన్ని చాటుకున్నారు. గారే వీరన్న (30) అనే వ్యక్తి అంబేద్కర్ సెంటర్లో వివిధ షాపుల యజమానులు చెప్పిన పని చేస్తూ, వైశ్య సత్రానికి కాపలాగా ఉండేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురికాగా మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించి మరణించగా వీరన్న మృతదేహాన్ని కేసముద్రంకు తీసుకువచ్చి అంబేద్కర్ సెంటర్ లో ఉన్న చిరు వ్యాపారులు అంతా సమిష్టిగా ఏకమై వీరన్న మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించారు.