17-04-2025 08:30:02 PM
బోథ్ (విజయక్రాంతి): బోథ్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మాడవి జల్లు(60) ఇచ్చోడలో బిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా చనిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. మృతున్ని తీసుకువెళ్లడానికి ఎవరు రాకపోవడం మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ, ఆదివాసీ నేతల ఆధ్వర్యంలో అంత్యక్రియలు చేసి, మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మాసం అనిల్ కుమార్, తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడప నగేష్, ఇచ్చోడ మండల వైస్ ఎంపీపీ కోడప జైలజ, జ్ఞానేశ్వర్, కొత్తూరు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.