28-01-2025 06:15:59 PM
ఐటిడిఏ పిఓ రాహుల్..
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చిరుమళ్ళ సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వాహణకు నిధులు కేటాయిస్తానని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. కరకగూడెం మండలం చిరుమళ్ళ గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే సమ్మక్క-సారలమ్మ దిమ్మలను జాతర నిర్వహించే పరిసర ప్రాంతాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి చైర్మన్ చందా లింగయ్య, జాతర నిర్వహణ కమిటీ సభ్యులను జాతరకు సంబంధించిన వివరాలను కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలను నిధులను కేటాయించాలని నిర్వహణ కమిటీ సభ్యులు ఐటిడిపి వరాహుల్ను కోరారు.
స్పందించిన పిఓ జాతర సమయంలో విద్యుత్, మంచి మీరు అంతర్గత రహదారులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయిస్తానని, అదేవిధంగా జాతరలో నిర్వహించే సాంప్రదాయ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే ఐటిడిఏ ఇంజనీరింగ్ అధికారులకు జాతరకు కావలసిన ఏర్పాట్లకు సంబంధించి నివేదికలు తయారు చేయాలని సూచించారు. ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించనున్న ఈ జాతర ప్రారంభ సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిధులు కేటాయించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసిన హెచ్డిఎఫ్పివో రాహుల్ కు జాతర నిర్వహణ కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.
ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు..
తిరుమల గ్రామంలో పర్యటించి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న వివో రాహుల్ అదే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాల తరగతి గదులను రికార్డులను పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 20 లక్షల రూపాయల నిధులతో విద్యార్థులకు మంచి డైనింగ్ హాల్ ను ఏర్పాటు చేస్తానని, మరో మూడు లక్షల రూపాయల నిధులతో వాష్ రూములను అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ... ఈ ఏడాది ఉత్తీర్ణశాతం పెరగాలని, ఉపాధ్యాయులు స్థానికంగానే ఉండి విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు ఐటిడిఏ డిఈ మధుకర్, ఐటీడీఏ ఏపీవో జనరల్ దేవరాజ్, ఎంఈఓ గడ్డం మంజుల ఎంపీడీవో కుమార్, ఆర్ ఐ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.