మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌ల్లో పెట్టుబడులు చేసే ఇన్వెస్టర్లు ఆయా స్కీములు గతంలో ఎటువంటి రాబడుల్ని ఇచ్చాయో అధ్యయనం చేసి, తగిన స్కీమ్‌ను ఎంపిక చేసుకోవాలని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి గత రాబడులు భవిష్యత్ లాభాలకు గ్యారంటీ కాదుగానీ, ఆయా ఫండ్స్ పనితీరును తెలుసుకునే సంకేతమే. మార్కెట్‌తో పోలిస్తే ఆయా స్కీమ్‌లు భవిష్యత్ రాబడులు ఎలా ఉండవచ్చో అంచనా వేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మదుపునకు ఉపక్రమించేముందు ఆయా ఫండ్ హౌస్ ప్రతిష్ఠ, పెట్టుబడి చేసే స్కీమ్ క్యాటగిరీ, అది యాక్టివ్ స్కీమా లేక పాసివ్ స్కీమా, యాక్టివ్ స్కీమ్ అయితే దాని ఫండ్ మేనేజర్ల గత పనితీరు పరిశీలించాలి. ఫండ్స్ ఆఫర్ చేసే స్కీమ్‌ల్లో లార్జ్‌క్యాప్ స్కీమ్స్, మిడ్, స్మాల్‌క్యాప్ స్కీమ్స్, మల్టీక్యాప్ స్కీమ్స్, వివిధ రంగాల స్టాక్స్‌పై ఫోకస్ చేసే సెక్టోరల్ స్కీమ్స్, ఫ్లెక్సీక్యాప్ స్కీమ్స్ తదితరాలుంటాయి.
వాల్యూ స్కీమ్స్
విలువ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాన్ని అవలంబించే స్కీమ్స్‌ను వాల్యూ స్కీమ్స్‌గా వ్యవహరిస్తారు. ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసే నిధుల్లో వాల్యూక్యాప్ ఫండ్ మేనేజర్లు కనీసం 65 శాతం స్టాక్స్‌లోకి మళ్లిస్తారు. ఇప్పుడు ఫండ్ పరిశ్రమలో 23 వాల్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. 2024 నవంబర్ 30నాటికి ఈ మొత్తం వాల్యూ స్కీమ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 1,89,470 కోట్లు ఉన్నది.
ఏడాది కాలంలో అధిక రాబడి ఇచ్చిన వాల్యూ స్కీమ్స్
ఏ మ్యూచువల్ ఫండ్ అయినా మార్కెట్ పనితీరు, ఫండ్ మేనేజర్ అనుసరించే పెట్టుబడి వ్యూహాలక అనుగుణంగా రాబడులు ఉంటాయి. గత ఏడాదికాలంలో స్టాక్ సూచీలు దాదాపు 15 శాతం పెరగ్గా, అంతకు మించి పలు వాల్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు రాబడుల్ని అందించాయి. వీటిలో అధికంగా ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ స్కీమ్ 32.34 శాతం రాబడుల్ని తెచ్చిపెట్టింది. జేఎం వాల్యూ ఫండ్ 28.35 శాతం, హెచ్‌ఎస్‌బీసీ వాల్యూ ఫండ్ 29.30 శాతం, యూటీఐ వాల్యూ ఫండ్ 27.71 శాతం చొప్పున రాబడుల్ని అందించాయి. అయితే గత పనితీరు భవిష్యత్తు రాబడులకు ప్రాతిపదిక కాదని ఇన్వెస్టర్లను పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు హెచ్చరిస్తుంటారు.
ఫ్లెక్సీ స్కీమ్స్
మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆఫర్ చేసే ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్‌లు వాటివద్దనున్న నిధుల్లో కనీసం 65 శాతం ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీకి కేటాయించిన నిధులను ఇవి స్టాక్ మార్కెట్లో ఎటువంటి మార్కెట్ విలువ కలిగిన షేర్లలోనైనా (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మా ల్‌క్యాప్) పెట్టుబడి చేస్తాయి. లార్జ్‌క్యాప్‌లో ఇంత, స్మాల్‌క్యాప్‌లో ఇంత ఇన్వెస్ట్ చేయాలన్న ని యమమేమీ లేదు. వివిధ రంగాలకు చెందిన స్టాక్స్‌లో పెట్టుబడి చేస్తాయి. సమయానుగుణంగా ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ మెంట్స్‌ను స్వేచ్ఛగా లార్జ్‌క్యాప్స్ నుంచి మిడ్‌క్యాప్స్‌లోకి, మిడ్, స్మాల్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్‌లోకి మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. అలాగే ఒక రంగం స్టాక్స్ నుంచి విక్రయించి, మరో రంగం షేర్లలోకి పెట్టుబడుల్ని షిఫ్ట్ చేస్తారు.
మూడేండ్లలో 15 శాతం చొప్పున వార్షిక రాబడి
దేశంలో వివిధ ఫండ్ హౌస్‌లు నిర్వహిస్తున్న దాదాపు 10 ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్‌లు గత మూడేండ్లలో చక్రగతిన 15 శాతం చొప్పున వార్షిక రాబడుల్ని అందించాయి. అన్నింటికంటే అధికంగా జేఎం ఫ్లెక్సీ క్యాప్ మూడేం డ్లలో 22.81 శాతం వార్షిక లాభాలను తెచ్చిపెట్టగా, హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ 21.58 శా తం వార్షిక రాబడిని ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 19.31 శా తం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీ క్యాప్ ఫం డ్ 17.23 శాతం చొప్పున రిటర్న్‌లు అందించాయి.