- భువనగిరి మున్సిపల్‌లో అధికారుల మాయాజాలం
- 14 వేల కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు లక్షలు స్వహా
- గతంలో కోతుల పేరిట నిధుల స్వాహా
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) ః వీధి కుక్కల ఏరివేత, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరిట భువనగిరి మున్సిపాలిటీలో లక్షల రూపాయల లెక్కలు చూపి కాజేయడానికి సంబంధిత అధికారులు ప్రజాప్రతి నిధులు కుమ్మక్కు కాజేయడానికి యత్నించారు అని కొంతమంది కౌన్సిలర్లే ఆరోపిస్తున్నారు.
మున్సిపాలిటీలలో రోజురోజుకు పెట్రేగి పోతు చిన్నపిల్లల, పెద్దల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న వీధి కుక్కల ఏరువేతకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రతి కుక్కకు టీకా ఇవ్వడంతో పాటు సంతాన ఉత్పత్తి కలగకుం డా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని నిర్ణయించి ఒక్కొక్క కుక్కకు 1400 నుండి 1500 రూపాయలను ఖర్చు చేయడానికి నిధులు మంజూరు చేసింది.
సంబంధిత మున్సిపల్ అధికారులు. చైర్మన్లు కలిసి పశు సమర్ధిక శాఖ అధికారులతో సంప్రదించి వీధి కుక్కల బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని ప్రతి వార్డులో చేపట్టాల్సి ఉంది. వీధి కుక్కల అవయవాలను సైతం లెక్కించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంది. సెంటర్ ఫర్ ఎనిమల్ బర్త్ ప్రీవియస్ ఆఫ్ డాగ్ ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు వివరించి వీధి కుక్కలను పట్టుకు పోవాలి.
ముందుగా యాంటీ రేబిస్ ఇంజక్షన్లను ఇస్తూ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమం చేపట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా భువనగిరి మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వీధికుక్కలను ఎప్పుడు పట్టుకుపోయారు అందు లో ఎన్ని కుక్కలను మున్సిపల్ అధికారులు డాగ్ ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కు తరలించారు.
అందులో ప్రతిరోజు ఎన్ని వీధి కుక్కలకు అన్నమ్మాపురంలో ఏర్పాటుచేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సెంటర్లో ఆపరేషన్ నిర్వ హించాలనేది లెక్కలేదు. 14 వేల వీధికుక్కలకు ఆపరేషన్ నిర్వహించినట్లు కాక లెక్కలు చూపుతూ లక్షలాది రూపా యలు కాజేశారని కౌన్సిలర్ల్లు ఆరోపిస్తున్నారు.
వేల కుక్కల కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశామని చెప్తున్నా మున్సిపల్ అధికారుల కాకి లెక్కలకు బజార్లలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వేటిని పట్టుకుని నియంత్రణ ఆపరేషన్ చేశారని. కుక్కల పేరుట కూడా నిధులు కాజేయడం చూసి ప్రజలు నవ్వుకుంటూ డబ్బు కోసం ఎంతటి నీచానికైనా పాల్పడతారు అని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
పట్టణంలో ప్రతి వీధిలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. కుక్కలకు తోడు కోతులు బెడద తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు కుక్కల కార్డులకు కోతుల దాడులకు గురై ప్రతిరోజు ఏరియా ఆసుపత్రికి బాధితులు లైన్ కడుతున్నారు. ఈ రెండింటి బెడద నుండి కాపాడాలని అధికారులకు ఎన్నిసార్లు విని యోగించుకున్న ఫలితం శూన్యమని ప్రజల ఆవేదన చేస్తు న్నారు.
గతంలో కోతులు పట్టి ఇతర ప్రాంతాలకు తరలిం చామని లక్ష రూపాయల కుంభకోణానికి మున్సిపల్ అధికా రులు పాల్పడ్డారు. ఈసారి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరిట నిధులు కాజేశారు అని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
భువనగిరి పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారు చేయని అభివృద్ధి పనుల పేరుమీద చేసినట్లుగా అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కు లక్షల రూపాయలు కాజేస్తూ దోపిడీకి పాల్పడుతు న్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మున్సిపల్ పర్మిషన్ జి ప్లస్ టు మాతృవి తీసుకుని నాలుగు అంతస్తులు నిర్మాణం చేస్తూ మున్సిపల్ చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకుండా పర్సంటేజ్ ఇస్తూ ప్రధాన రోడ్లమీద భౌలంతస్తులు నిర్మాణం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారి నిర్మాణాలని అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలోనైనా భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి సాధిస్తుందని ప్రజల ఆశిస్తున్నారు.