04-03-2025 12:19:33 AM
మంత్రిని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
జగిత్యాల, మార్చి 3 (విజయక్రాంతి) : జగిత్యాల మెడికల్ కళాశాలలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధు లు మంజూరు చేయాలని రాష్ర్ట వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కోరా రు. సోమవారం హైదరాబాద్లోని మంత్రి దామోదర రాజనర్సింహ కార్యాలయంలో రాష్ర్టంలో మంజూరైన మెడికల్ కాలేజీల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ జగిత్యాల మెడికల్ కళాశాల పెండింగ్ పను ల విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ర్టంలో గతంలో ఫేస్-1 లో మంజూరైన జగిత్యాల ఆస్పత్రిలో 650 పడకలకు గానూ 330 పడకల ఆసుపత్రిగా ఉందని వివరించారు.
కాగా మిగిలిన 320 పడకల ఆసుపత్రి పనుల కోసం ప్రభుత్వం గత నవంబర్లో జీవో జారీ చేసీందని, ఆ పనుల కోసం వెం టనే టెండర్లు పిలవాలని టీఎస్ ఎంఐడిసి, యండి, సిఈని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజిలో పనులు పూర్తయిన నిర్మాణాల బాపతో బిల్లుల చెల్లింపుల విషయం లో కొంత ఆలస్యం జరుగుతుందని, అట్టి బిల్లులను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు.
తద్వారా మెడికల్ కళాశాల విద్యార్థులకు వసతి గృహం, హాస్టల్, తరగతి గదుల పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అవకాశం ఉందని, విద్యార్థులకు చాలా ఉపయో గంగా ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహని కోరినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. స్పందించిన మంత్రి పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా సంబందిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టియానా, అధికారులు పాల్గొన్నారు.