13-03-2025 12:00:00 AM
ప్రజాతంత్ర ఆలోచన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దశరథం
హనుమకొండ, మార్చి 12 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగరి 56 వ డివిజన్ గోపాపూర్ ఊర చెరువు అభివృద్ధి పరిరక్షణకు, సుందరీకరణకు నిధులు మంజూరి చేయించాలని ప్రజాతంత్ర ఆలోచన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తుపాకుల దశరథం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ను కోరారు.
ఈ మేరకు ఎమ్మెల్యే నాగరాజును హైదరాబాదులోని సచివాల యం వద్ద కలిసి బుధవారం కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తుపాకుల దశరథం మాట్లాడుతూ గోపాల్ పూర్ చెరువు అభివృద్ధి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు మంజూరు చేయిం చాలని కోరారు. గోపాల్ పూర్ చెరువులో మురికి నీరు ప్రవహించకుండా అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.