calender_icon.png 12 February, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

12-02-2025 12:47:43 AM

  • రూ. 32 కోట్లతో స్టేడియం అభివృద్ధికి ప్రతిపాదనలు
  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

సంగారెడ్డి, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): సంగారెడ్డి పట్టణంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధికి రూ. 32 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి లు ప్రతిపాదనలు అందజేశారు.

మంగళవారం సంగారెడ్డి పట్టణంలో ని అంబేద్కర్ స్టేడియంలో పరిశీలించి స్టేడియం కు అభివృద్ధి కోసం ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్, కబడ్డీ, షటిల్, చెస్, హ్యాండ్ వాల్, వాలీబాల్, జిమ్ తో పాటు సింథటిక్ 800 మీటర్స్ రన్నింగ్ ట్రాక్, ఫుట్ బాల్, హాకీ, ఖోఖో , క్రికెట్ క్రీడలకు అవసరమైన వాటిని ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోపాజి అనంత కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్, కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతిలాల్, కాంగ్రెస్ నాయకులు కోన సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.