05-03-2025 07:59:27 PM
హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్...
మేయర్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేత..
ఎల్బీనగర్: హస్తినాపురం డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిని స్టాండింగ్ కమిటీ మెంబర్, హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ కోరారు. బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మిని కార్పొరేటర్ సుజాత నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి రోడ్ల నిర్మాణాలు, ఇతర పనులకు నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... హస్తినాపూర్ డివిజన్ అభివృద్ధి తన లక్ష్యమన్నారు. డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలు అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. మేయర్ విజయలక్ష్మి సానుకూలంగా స్పందించి డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ సుజాత నాయక్ తెలిపారు.