13-03-2025 10:52:17 PM
కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేత
ఎల్బీనగర్: కొత్తపేట డివిజన్ లోని కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అధికారులను కార్పొరేటర్ పవన్ కుమార్ కోరారు. ఈ మేరకు గురువారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కుమార్ పాటిల్ ని కలిసి డివిజన్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... కొత్తపేట్ డివిజన్ పరిధిలోని కాలనీల్లో రోడ్లు పాడైపోయి నడవలేని స్థితిలో ఉన్నాయన్నారు. నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ. కోటి నిధులు మంజూరు చేయాలని కోరారు. డివిజన్ పరిధిలో బాక్స్ డ్రైనేజీ నిర్మాణాలకు సుమారు రూ, 2కోట్లు మంజూరు చేయాలన్నారు. కొత్తపేట డివిజన్ పరిధిలో మూసీ నది ప్రవహిస్తుండడంతో దోమల బెడద ఎక్కువగా ఉందని, దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. డివిజన్ పరిధిలోని తెలంగాణ పార్క్, ప్రజయ్ నివాస్ ఫేజ్ -1 లో కాలనీ ప్రజల అవసరాలకు నూతన ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయించాలని, స్నేహపురి కాలనీ పార్క్ చూట్టు ప్రహరీ ఏర్పాటు చేయించాలని కోరారు. కాలనీల్లో ఐమాక్స్ పోల్స్ లైట్స్ ఏర్పాటు చేయించాలన్నారు. శంకర్ కాలనీలోనీ కమ్యూనిటీ హాల్ లో మరమ్మతులు చేయించాలని కోరారు. వారు వెంటనే మరమ్మత్తులు చేయిస్తామని హామీనిచ్చారు. కొత్తపేట డివిజన్ సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ హామీ ఇచ్చారు.