19-02-2025 01:09:59 AM
తిరుమలగిరి, ఫిబ్రవరి 18 : తిరుమలగిరి మున్సిపల్ పరిస్థితి ఆదాయం ఫుల్లు అభివృద్ధి నిల్‌గా మారిందని సిపిఎం నాయ కుడు కడెం లింగయ్య అన్నాడు ఈ సంద ర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో కోట్ల రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ తిరుమలగిరి అభివృద్ధి జరగపోవటం శోచ నీయం ఇంటి పన్నులు నల్ల బిల్లులు.
ఇంటి నిర్మాణం కోసం బిల్లులు ఇల్లు కట్టుకోవ డానికి పర్మిషన్ బిల్లులు సంత వేలపాట బిల్లులు వీటన్నిటితో పాటు ప్రభుత్వం మున్సిపల్ అభివృద్ధి కోసం ఇస్తున్న కోట్ల రూపాయలను మున్సిపల్ అధికారులు సంబంధిత ప్రజాప్రతినిధులు వీరందరూ కుమ్మక్కై కోట్లరూపాల ప్రజాధనాన్ని దుర్వినియోగం తప్ప, అభివృద్ధి లేదని విమర్శించారు అభివృద్ధి వైపు నిధులు విడుదల చేయకపోతే మరో పోరాటం తప్పదనే హెచ్చరించారు.