19-03-2025 01:56:03 AM
అసెంబ్లీలో రైతుల గోడు వినిపించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
మనకొండూర్, మార్చి18 (విజయ క్రాంతి): ఇల్లంతకుంట మండలం పెద్దలింగా పూర్ గ్రామ రైతుల ఆందోళనకు కారణమైన కాలువ సమస్యను వెంటనే తీర్చాలని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రాష్ట్ర ప్రభు త్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం సభలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
పంట పొలాలు ఎండిపోకుండా కాలువ నిర్మాణం చేపట్టి నీరందించాలని పెద్దలింగాపూర్ రైతులు ఆందోళనలు చేపట్టారని, వారి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు వీలుగా అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ప్రస్తుతం రైతులు ఎదు ర్కొంటున్న కాలువ సమస్యకు గత బీఆర్ ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రెండు పర్యాయాలు మానకొండూర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్దలింగాపూర్ రైతుల గోడును పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.