10-03-2025 08:13:32 PM
- హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి..
- జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి వినతిపత్రం అందజేత..
ఎల్బీనగర్: హయత్ నగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి కోరారు. హయత్ నగర్ డివిజన్ లోని వివిధ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరు చేయాలని సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... హయత్ నగర్ డివిజన్ శివారులో నూతనంగా అనేక కాలనీలు ఏర్పడుతున్నాయని తెలిపారు. శివారు కాలనీల్లో ప్రజలు కనీస, మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కార్పొరేటర్ వెంట ఆర్టీసీ మజ్దూర్ కాలనీ అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నాయకుడు సూర్యా నాయక్ తదితరులు ఉన్నారు.