సీఎంకు మాజీ మంత్రి చంద్రశేఖర్ వినతి
జహీరాబాద్, జూలై 11: జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని జహీరాబాద్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం జహీరా బాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నాయకులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతి అందజేశారు. గత పాలకుల పాలనలో జహీరాబాద్ అన్ని రంగాల్లో వెనుకబడిందని, ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం హైదరాబాద్‌లో టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నిర్మలాజగ్గారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.