- ఏఐఎస్‌ఎఫ్ రాష్ర్ట అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ర్ట అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్ టాప్ లు, 5 లక్షల భరోసా కార్డు పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, విద్యకు బడ్జెట్లో అధిక నిధులు ఇవ్వాలని, కరీంనగర్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నా రాష్ర్టంలో ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు చేస్తున్న ముందస్తు అడ్మిషన్లు నియంత్రించడంలో విద్యాశాఖాధికారులు వైఫల్యం చెందాని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపెల్లి హేమంత్, నాయకులు సందీప్ రెడ్డి, శ్రావణ్, వినయ్, అజయ్, అశోక్, రాజేష్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు