calender_icon.png 26 October, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగానికి నిధులు కేటాయించాలి

22-07-2024 01:49:08 AM

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పించాలి

సంగారెడ్డి పీడీఎస్‌యూ అధ్యక్షుడు సురేష్ 

సంగారెడ్డి, జూలై 21 (విజయక్రాంతి) : ప్రభుత్వం విద్యారంగానికి 30 శాతం నిధు లు కేటాయించాలని సంగారెడ్డి జిల్లా పీడీఎస్‌యూ అధ్యక్షులు ఎం సురేష్ డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని శ్రీతేజ జూనియర్ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాం డ్ చేశారు. గత ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు.

ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి విద్యార్థుల జీవితాలతో అడుకుటుందన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాని కి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలన్నారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యా యులను నియమించి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయలు కల్పించాల న్నారు. పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి నరిసింహారెడ్డి, నాయకులు అర్జున్ సిధ్దూ, ఆకాశ్,  కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.