calender_icon.png 15 November, 2024 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి

11-11-2024 12:00:00 AM

కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని మజ్లీసేతర ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకుండా మజ్లీస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అడ్డుపడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి విమర్శించారు. నగరంలోని నాంపల్లి, అంబర్‌పేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోషామహల్ లాంటి ప్రాంతాల్లో బస్తీల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపి తగిన నిధులు కేటాయించాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

నాంపల్లి నియోజకవర్గంలోని మల్లేపల్లి డివిజన్ డీనూ ఆసీఫ్‌నగర్ డివిజన్ దయాబాగ్‌లో కమ్యూనిటీ హాల్ భవనాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లకు నిధుల కొరత వేధిస్తుందన్నారు. నగరంలో వీధి దీపాలను కూడా మెయింటేన్ చేసే పరిస్థితి లేదన్నారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని కారణంగా కొత్త టెండర్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఈ పరిస్థితిలో జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ సాయంతో సుమారు రూ.78 లక్షలతో కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ జిమ్స్, బోర్ వెల్స్ తదితర సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. గ్రేటర్‌లో నిధులు లేని కారణంగా అరకొర సౌకర్యాలతో పాఠశాలలు నడుస్తున్నాయన్నారు.