అదనపు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేసేందుకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమస్యల వివరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం తగదని ధాన్యం కొనుగోలుకు రైతులకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను చేయాలని అదనపు కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్సుల కోసం రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారని వెంటనే షెల్టర్, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రైతులు పండించిన వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.