ఎస్‌ఎఫ్‌ఐ
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో కోరింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ పాఠశాలల బంద్ కార్యక్రమం విజయవంతమైందని అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టి.నాగరాజు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయని, ఇప్పటివరకు 930 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారని వారు పేర్కొన్నారు.