calender_icon.png 19 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య యువజన రంగాలకు నిధులు కేటాయించాలి

17-03-2025 02:06:25 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ , మార్చి 16(విజయక్రాంతి): బడ్జెట్లో విద్యా, యువజన రంగాలకు ప్రాధాన్యత కల్పించి అత్యధిక నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ ,డివైఎఫ్‌ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించి విస్మరించిందన్నారు.

జాబ్ క్యాలెండర్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. యూత్ డిక్లరేషన్ సైతం అమలు చేయడంలో విఫలమయ్యారని గుర్తు చేశారు. విద్యా ఉపాధి ఉద్యోగం కొరకు అధిక నిధులు కేటాయించడం తో పాటు క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మండల కేంద్రాలలో క్రీడా మైదానం నిర్మాణాలకు ప్రత్యేక బడ్జెట్ అందించాలని డిమాండ్ చేశారు.

గ్రంథాలయలను అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పోటీ పరీక్షల నేపథ్యంలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బిజెపి ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వా సాకే సాయికుమార్, కార్తీక్, దినకర్, రాజేందర్, టీకానంద్, శ్రీనివాస్ గిరి కుమార్, నిఖిల్, మంజుల  పాల్గొన్నారు.