22-03-2025 12:00:00 AM
హనుమకొండ,మార్చి 21 (విజయ క్రాంతి): పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్, కూడా పరిధిలోని నిధులు మంజూరు చేయడానికి సహకరించిన నగర మేయర్ గుండు సుధారాణి,కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డిలచొరవతో శరవేగంగా జరుగుచున్న అభివృద్ధి పనుల్లో భాగంగా వడ్డేపల్లి పబ్లిక్ హెల్త్ సెంటర్ కు రూ. కోటి యాభై లక్షలు, గ్రేవి యార్డ్ కు రూ. కోటి ఇరవై లక్షలు, స్మార్ట్ సిటీ కింద రూ. ఐదు కోట్లు, కూడా నిధులు రూ. రెండు కోట్లు మంజూరు చేయడం జరిగింది.
ఇట్టి నిధులతో వడ్డేపల్లి, కుమ్మరి వాడ, మిడిదొడ్డి వాడ, రెడ్డి వాడ , విజయపాల్ కాలనీ, టీచర్స్ కాలనీ పేస్ వన్, బ్యాంక్ కాలనీలలో నిర్మాణమైన సిసి రోడ్లను, పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ ఎనుకొండ నాగరాజు, ఫిషర్స్ మెన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మండల సమ్మయ్య,58 వ డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్,సోషల్ మీడి యా రాష్ట్ర సెక్రెటరీ ఎండి నేహల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి రవీందర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు బుస నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.