22-03-2025 05:55:15 PM
బైంసా (విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గంలోని కుబీర్ మండల తహసిల్దార్ కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం రూ. 50 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. కుబీర్ లో తాసిల్దార్ భవనం లేక గత కొంతకాలంగా ఇతర ప్రభుత్వ భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలు అధికార యంత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిధుల మంజూరు తో ఈ సమస్య తీరని ఉందని ఎమ్మెల్యే తెలిపారు.