హైదరాబాద్,(విజయక్రాంతి): దావోస్ సదస్సు ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జనవరి 20 నుంచి 24 వరకు దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు జరుగనుంది. దావోస్ ఆర్థిక ఫోరం సదస్సుకు వెళ్లనున్న రాష్ట్ర ప్రతినిధుల బృందంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎంతో పాటు రాష్ట్ర బృందం దావోస్ లో పర్యటించబోతుంది. ఐటీ పరిశ్రమల శాఖ నుంచి ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ 12.30 కోట్లు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గతేడాది డిసెంబర్ లో రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జనవరి 2024 లో జరిగిన ఈ డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలను ఆకర్శించారు. గతేడాది పర్యాటనలో తెలంగాణకు మొత్తం 40,232 కోట్లు పెట్టుబడులు వచ్చాయని సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఈ ఏడాది కూడా దావోస్ లో పర్యటించి ఇన్వెస్టర్లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.