calender_icon.png 18 March, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారి నిర్మాణానికి రూ.156 కోట్లు విడుదల

11-03-2025 08:11:44 PM

మద్నూర్ రుద్రూర్ రహదారికి మంజూరు..

ఫలించిన జుక్కల్ ఎమ్మెల్యే కృషి..

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని ప్రధాన జాతీయ రహదారి నిర్మాణం పనులకు మంగళవారం 156 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఎట్టేకేలకు కామారెడ్డి జిల్లా లోని జుక్కల్ నియోజక వర్గం లో ప్రతిపాదించబడిన మద్నూర్ - రుద్రూర్ జాతీయ రహదారికి రూ. 156 కోట్లు నిధులు విడుదల కావడంతో ఆ రహదారికి మహర్దశ మొదలైంది. గత సంవత్సర కాలంగా వివిధ రూపాలలో ఈ రహదారి ప్రాధన్యతని అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి ఇటు రాష్ట్ర రహాదారుల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి, నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందరిని పరుగులు పెట్టించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి ఏట్టకేలకు ఫలించింది. 

బోధన్ - బాసర - భైంసా రహదారిలో భాగంగా మద్నూర్ - రుద్రూర్ సెక్షన్ రహదారి కలదు. ఈ రహదారి నిర్మాణం కోసం 156 కోట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ సంధర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. సోమవారం యంగ్ ఇండియా సమూహిక రెసిడెన్షియల్ స్కూల్ కి రూ. 200 కోట్లు మంగళవారం మద్నూర్ - రుద్రూర్ రహదారి కోసం రూ.156కోట్లు విడుదలకు కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు.