ప్రభుత విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): చెరువులు, బ్రిడ్జిలు, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రకటించారు. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండ లంలోని లింగాపూర్ గ్రామంలో నిండిన చెరువును బుధవారం ఆయన పరిశీలించారు. శాలపెల్లి నుంచి అడపపెల్లి, రంగధా మునిపల్లె గ్రామాల్లో వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
అధికారులతో మాట్లాడి గ్రామస్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, సీఆర్‌ఆర్ గ్రాంట్ నుంచి రూ.ఐదు కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి నివేదిక పంపించాలని ఆదేశించారు. తూములకు మరమ్మతు పూర్తి చేయాలని, మద్దులపల్లి గ్రామానికి చెందిన బ్రిడ్జి నిర్మాణాన్ని తరగా పూర్తి చేయాలని ఆదేశించా రు. కాగా చెరువు, వాగులు, రోడ్ల రక్షణకు ముందస్తుగా తీసుకున్న చర్యలేవీ అని ఎమ్మె ల్యే అడగగా.. అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేదు.