17-04-2025 04:05:47 PM
హమాలి పనిచేసిన జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు..
మణుగూరు (విజయక్రాంతి): బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు(Rega Kantha Rao) గురువారం మణుగూరులో హమాలి పనిచేసి వచ్చిన కూలి డబ్బులను ఈనెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు అందించినట్లు రేగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు, మండల పట్టణ పార్టీ కన్వీనర్ కురి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, నాయకులు ముత్యం బాబు, అడపా అప్పారావు, నూకారపు రమేష్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.