calender_icon.png 8 February, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా రూ.1.30 కోట్ల నిధులు మంజూరు

07-02-2025 10:35:13 PM

డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి...

కడ్తాల్ (విజయక్రాంతి): కడ్తాల్ మండలానికి ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా రూ.1.30 కోట్లు మంజూరైనట్లు డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కడ్తాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, మండల పార్టీ అధ్యక్షుడు బీఛ్యా నాయక్, నాయకులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కడ్తాల్ మండలానికి వివిధ గ్రామాలకు ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి సహాకారంతో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం 28 పనులకు సిఆర్ఆర్ ఫండ్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. 

డ్రైనేజీ, సీసీ రోడ్లకు ఈ నిధులు వినియోగించనున్నారు. అన్మస్ పల్లి రూ.3 లక్షలు, చల్లంపల్లి రూ.7 లక్షలు, చరికొండ రూ.10 లక్షలు, ఏక్వాయిపల్లి రూ.10 లక్షలు, కర్కల్ పహాడ్ రూ. 4లక్షలు, మక్తమాధారం రూ.10 లక్షలు, మర్రిపల్లి రూ.8 లక్షలు, ముద్విన్ రూ.15 లక్షలు, రావిచెడ్ రూ.15 లక్షలు, సాలార్ పూర్ రూ.10 లక్షలు, వాసుదేవ్ పూర్ రూ.8 లక్షలు, గోవిందాయపల్లి రూ.10 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్, కిసాన్ సెల్ అధ్యక్షులు బాలరాజు, నాయకులు యాదగిరి రెడ్డి జంగీర్ అలి, సత్యం యాదవ్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, మండల యూత్ అధ్యక్షులు బోసురవి, ఎస్సీ సెల్ నాయకులు ఎర్రోళ్ల శ్రీకాంత్, రమేష్ నాయక్, సెవ్యా, శ్రీను నాయక్ తదితరులు ఉన్నారు.