దక్షిణ మధ్య రైల్వే అధికారి లోకేశ్ విష్ణుయ్ వెల్లడి
రామాయంపేట, డిసెంబర్ 3: దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధికి రూ.2,300 కోట్ల నిధులు మంజూరయ్యాయని.. ఆయా నిధులతో నూతన మార్గాలను ఏర్పాటు చేయనున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారి లోకేశ్ విష్ణుయ్ తెలిపారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ.. మేడ్చెల్ నుంచి ముద్కేడ్ వరకు రూ.2,300 కోట్లతో చేపడుతున్న 220 కి.మీటర్ల డబుల్ రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయని, అదేవిధంగా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రైల్వే విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నట్లు చెప్పారు.
ఆయన వెంట డివిజనల్ రైల్వే మేనేజర్ హైదరాబాద్ డివిజన్ డాక్టర్ అనిరుధ్ పామర్, డీసీఎంవీ విద్యాధర్, డీవోఎం కె.విజయ్‌కుమార్, డీఎస్‌వో విష్ణుచైతన్య, డీఈఈ ట్రాక్షన్ నీలపావని, డీఎస్ టీఈ ఫిర్దోస్ ఖాన్ పాల్గొన్నారు.