calender_icon.png 16 January, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజన కార్మికులకు నిధులు

06-08-2024 02:39:05 AM

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన పథకం కింద కుక్ కమ్ హెల్పర్స్‌కు సంబంధించిన నిధులను పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. గతం లో వారికి గౌరవ వేతనం రూ.వెయ్యి ఇచ్చేవారు. గత ప్రభుత్వం రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పెంచిన నిధులకు సంబంధించి ఫస్ట్, సెకండ్ క్వార్టర్ కాలానికి నిధులను విడుదల చేస్తూ ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 విద్యాసంవత్సరానికి చెల్లించాల్సిన నిధులను రూ.18,06,70,000లను విడుదల చేసింది. గతంలో రూ.36,13,40,000 నిధులను విడుదల చేసింది.