- మంజూరు చేసిన డిప్యూటీ సీఎం భట్టి
- ఆదిలాబాద్‌లో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- పెనుగంగ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని భట్టి హామీ
ఆదిలాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల సమయంలో పాదయాత్ర మొదలుపెట్టిన పిప్రి గ్రామంలో బుధవారం పర్యటించిన భట్టి రూ.20.5 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభించారు. రాళ్ల వాగు బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురవుతున్న మంచిర్యాల పట్టణానికి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామన్నారు. సదర్మట్ ప్రాజెక్టును నెల రోజుల్లో పూర్తిచేసి నీళ్లు అందిస్తామని చెప్పారు.
పెనుగంగ ప్రాజెక్టులను గత ప్రభుతం పూర్తిగా గాలికి వదిలేసిందని, ప్రజా ప్రభుతం వాటిని పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. ఎస్టీఎస్‌డీఎఫ్ కింద రూ.15 కోట్లతో తొమ్మిది రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో వాంకిడి సబ్ స్టేషన్‌కు పునాదిరాయి వేశారు. రూ.3.5 కోట్లతో పిప్రి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల పనులను ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో కలెక్టర్ రాజరిషా, ఎస్పీ గౌష్ ఆలం, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కోట్నక్ తిరుపతి, ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్, పాయల్‌శంకర్, ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా తదితరులు పాల్గొన్నారు.