14-09-2024 12:39:04 AM
రూ.48.86 కోట్లు గ్రాంట్స్ మంజూరు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల నిర్వహణకు విద్యాశాఖ నిధులను మంజూరు చేసింది. 2024 విద్యాసంవత్సరానికి రూ.48.86 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇవీ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ గ్రాంట్ కింద రూ.36.43 కోట్లు కేటాయించగా, స్పోర్ట్స్ గ్రాంట్ కింద రూ.12.42 కోట్లు కేటాయించారు. అయితే ఈ నిధులు జీరో ఎన్‌రోల్‌మెంట్, పీఎం శ్రీ ఫేజ్ 2 పాఠశాలలకు మినహాయించి మిగతా అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్, గిరిజన, స్పోర్ట్స్ పాఠశాలలకు మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఇదిలా ఉంటే ఈనెల 10వ తేదీన ‘విజయక్రాంతి’లో ‘నిధుల్లేక వెనుక ‘బడి’న నిర్వహణ!’ అనే వార్తా కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన విద్యాశాఖ ఈమేరకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్‌ల మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.