calender_icon.png 16 January, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాశాఖకు నిధులివ్వండి

06-07-2024 01:40:36 AM

రూ.20 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో పాఠశాల విద్యాశాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాదిలో రూ.16 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపగా.. 12 వేల కోట్ల వరకు కేటాయించారు. ప్రతి ఏడాది కేటాయిస్తున్న బడ్జెట్‌లో దాదాపు 80 శాతంపైగా నిధులు జీతాలకే ఖర్చు అవుతోంది. ఈక్రమంలో ఈసారి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు నిధులను కేటాయించాలని ఈనెల 8న డిప్యూటీ సీఎంతో జరిగే ప్రీబడ్జెట్ సమావేశంలో ప్రతిపాదించనున్నారు.