కరీంనగర్, జనవరి 11 (విజయ క్రాంతి): కరీంనగర్ లోని అంభేడ్కర్ స్టేడియంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు శనివారం పలువురు పిల్లలతో కలిసి సరదాగా క్రికేట్ ఆడారు. చిన్నారు వేసిన బంతులకు చక్కటి బ్యాటింగ్ ను ప్రదర్శించారు. అనంతరం చిన్నారులకు క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ లాంటి వివిధ రకాల క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొవాలని సూచించారు.
చదువుతో పాటు వివిధ రకాల క్రీడల్లో రానిస్తేనే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఖాళీ సమయాల్లో ఆటలు ఆడితేనే శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుందని... సెల్ ఫోన్ గేమ్స్, టిక్ టాక్ లు, టీవిలకు చాలా దూరంగా ఉండాలని వాటి ద్వారా మానసికంగా చాలా నష్టం జరుగుతుందని విద్యార్థులకు వివరించారు. క్రీడల్లో చాలా మెలకువలు నేర్చుకొని... ఎంచుకున్న క్రీడలో నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు మేయర్‌సూచించారు