calender_icon.png 20 April, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులకు పూర్తిగా సహకరించా

20-04-2025 12:42:32 AM

  1. రీపోస్ట్ చేసిన 2వేల మందిపై చర్యలు తీసుకుంటున్నారా?
  2. నోటీసులపై ‘ఎక్స్’లో స్మితా సబర్వాల్ ట్వీట్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): గచ్చిబౌలి పోలీసు అధికారు లకు పూర్తిగా సహకరించానని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు తన వివరణను ఇచ్చానని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తెలిపారు. శనివారం తన ఎక్స్ ఖాతాలో ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. కాగా కంచె గచ్చిబౌలి భూముల విషయంలో 2వేల మంది వ్యక్తులు ఫొటోలు రీపోస్ట్ చేశారని, వారందరిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.

ఇది సెలెక్టివ్ టార్గెటింగ్ అని ఆందోళన కలుగుతోందన్నారు. చట్టం ముందు సహజ న్యాయం, సమానత్వం సూత్రాలను ఇది రాజీ చేస్తోందని విమర్శించారు. కాగా కంచె గచ్చిబౌలిలో వణ్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన ఓ నకిలీ ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు ఆమెకు ఈ నెల 12న నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.