calender_icon.png 13 November, 2024 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యానికి పూర్తి మద్దతు ధర

09-11-2024 12:11:21 AM

  1.  సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా 
  2. నేలకొండపల్లిలో దివ్యాంగుడికి కేక్ తినిపిస్తున్న మంత్రి పొంగులేటి  

  3. పత్తి రైతును మోసగిస్తే కఠిన చర్యలు 
    1. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి 

ఖమ్మం, నవంబర్ 8 (విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించారు. నేలకొండపల్లిలో జడ్పీ స్కూల్‌లో సైన్స్ ల్యాబ్  నిర్మాణానికి, పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం  నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సీఎం పుట్టిన రోజు సందర్భంగా దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేశారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు కల్యాలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ బడులకు వచ్చేలా విశ్వాసం కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధర చెల్లించి కొంటామన్నారు. సీసీఐ ద్వారా పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. తేమ వంటి కారణాలు చెబుతూ రైతులను ఇబ్బంది పెట్టాలని వ్యాపారులు, అధికారులు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సర్వేకు ప్రజలు సహకరించాలి

ఖమ్మం రూరల్ మండలం కోట నారాయణపురంలో కుటుంబ సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక రచన కోసమే సర్వే అని, ఎటువంటి అపోహలు లేకుండా సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో  53,6,335 కుటుంబాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లకు మంత్రి కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.