20-02-2025 05:14:12 PM
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో నిర్వహించిన ఓయూ జేఏసీ మీడియా సమావేశంలో ఓయూ జేఏసీ కన్వీనర్ బొమ్మ కంటి సత్యపాల్, నాయకులు, సాయి, ఎల్చాల వంశీకృష్ణ, మాట్లాడుతూ... రెండు జాతీయ పార్టీలు మద్దతిస్తున్న అభ్యర్థులు ఆధిపత్య అగ్రవర్ణాలు కావడం కొన్ని దశాబ్దాలుగా ఒకే ఆధిపత్య కులం పోటీ చేస్తూ గెలుస్తూ వారికున్న రాజకీయ ఆర్థిక సామాజిక ఆధిపత్యంతో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం లేకుండా చేయడం చూస్తున్నాం ఇకనైనా మేల్కొని ఈ వర్గాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలని అన్నారు.
అన్నీ తెలిసిన మేదావులు, పట్టబద్రులు, ఉద్యోగులు ఈసారి కచ్చితంగా మనలో ఒకడైన డా.ప్రసన్న హరికృష్ణ బహుజనుల ఆత్మీయ బంధువు ఓయూ పూర్వ విద్యార్థి, తెలంగాణ ఉద్యమకారుడు, వందలాది పోటీ పరీక్షల పుస్తకాల రచించి వేలాది మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ప్రొఫెసర్ తన 19 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రుల, ఉద్యోగుల, నిరుద్యోగుల, విద్యార్థుల, ఆశయ సాధనకై మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డా.ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత(1) ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రసన్న హరికృష్ణ గెలుపుతో బహుజనుల ఐక్యతను చాటాలని ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసి నాయకులు అనిల్ ప్రజాపతి, కోడూరు రఘు, రాజు ముదిరాజ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.