calender_icon.png 5 March, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్ బాధితులకు అండగా జాన్సన్ నాయక్?

04-03-2025 11:35:23 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): గల్ఫ్ బాధితులకు అండగా ఉండి నిర్మల్ జిల్లా, ఖానాపూర్ బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి, జాన్సన్ నాయక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది? ఖానాపూర్ నియోజకవర్గంలోని, ఖానాపూర్, కడెం మండలాల, సారంగాపూర్, లింగాపూర్, గ్రామాలకు చెందిన పలువురు ఇటీవల మలేషియా దేశానికి వెళ్లి, అక్కడ పోలీసులకు చిక్కి, జైల్లో ఉన్నట్లు తెలుసుకున్న సమాచారం మేరకు, స్పందించిన జాన్సన్ నాయక్, హుటాహుటిన మలేషియా దేశానికి వెళ్లి, వారిని పరామర్శించి, స్వదేశానికి తీసుకురావడానికి, తగు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.? ఈ మేరకు సోమ, మంగళవారాలు ,జాన్సన్ నాయక్ మలేషియా దేశంలో పర్యటిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రెండు మండలాల ప్రజలు, ఝాన్సన్ నాయక్ ను అభినందిస్తున్నారు.