- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- వెలిమెలలో వైభవంగా కామరాతి బీరప్ప విగ్రహ ప్రతిష్టాపన
పటాన్ చెరు/రామచంద్రాపురం, జనవ రి 31 : పటాన్ చెరు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవా రం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలి మెల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కామారతి సమేత బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వ హించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో ప్రజలు మానసిక ప్రశాంతత కోసం దైవచింతనను అలవరచుకోవాలని కోరారు. నియోజకవర్గం వ్యాప్తంగా పరమ త సహనాన్ని పెంపొందిస్తూ ఆలయాలు, చర్చిలు, మసీదులు నిర్మిస్తున్నామని తెలి పారు.
కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సి పల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సర్పంచుల సంఘం రాష్ర్ట మాజీ అధ్యక్షు డు సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, జిల్లా నాయకులు గూడెం మధు సూదన్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఆదర్శ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు రవీందర్ రెడ్డి, కొమరయ్య, శ్యామ్ రావు, ఉమేష్, శ్రీనివాస్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక : గూడెం
పటాన్‌చెరు, జనవరి 31 : మినీ ఇండియా గా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీక గా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహి పాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణాని కి చెందిన జీఎంఆర్ యువసేన నాయకు డు సోహెల్ బృందం అజ్మీర్ దర్గా వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యం లో చదర్ సమర్పణ నిర్వహించారు. అనం తరం ప్రత్యేక ప్రార్థనల నిర్వహించారు.
అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసం తోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్య క్రమంలో సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అఫ్జల్, పాండు, గూడెం విక్రం రెడ్డి, మాణిక్ రెడ్డి, మేరాజ్ ఖాన్, షకీల్, ఇమ్రాన్, మసూద్, సోహైల్, ఆదిల్, ఇర్ఫాన్, వసీం, వినయ్, తదితరు లు పాల్గొన్నారు.