25-03-2025 01:33:58 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్ చెరు/గుమ్మడిదల, మార్చి 24 :రాష్ట్రంలోనే ప్ర ముఖ శైవ క్షేత్రంగా పేరొందిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. దేవస్థానం నవహ్నిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని సోమవారం దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ పాలకవర్గం, దేవస్థానం పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డివ మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందజేశానని గుర్తు చేశారు.
భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సంభందిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈవో శశిధర్, షేక్ హుస్సేన్, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- రామాలయ ముఖ ద్వారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వందనాపురి కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ముఖ ద్వారాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
సొంత నిధులతో ఆలయ ము ఖద్వారం నిర్మించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహా గౌడ్, సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, ప్రమోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.