calender_icon.png 9 January, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనకు సంపూర్ణ మద్దతు

03-11-2024 02:16:12 AM

తెలంగాణ ముదిరాజ్ మహాసభ  వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం ముదిరాజ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కులగణ నకు ముదిరాజ్‌ల తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు తెలంగాణ ముదిరాజ్ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం ముదిరాజ్ తెలిపారు.

బీసీ కమిషన్ చైర్మన్‌కు ముదిరాజ్ సంఘం తరపున లేఖ రాశారు. గత పాలకుల తప్పిదాల వల్ల 60 ఏండ్లుగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ముదిరాజ్‌లు వెనకబాటుతనానికి గురయ్యారని ఆరోపించారు. పేదరికంలో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.

చేపలు పట్టేవాళ్లందరినీ మత్సకారు లుగా గుర్తించి బీసీ లో చేర్చాలని 1964 లోనే జీవో నంబర్ 98 ద్వారా నాటి ప్రభు త్వం నిర్ణయించిందని జ్ఞాపకం చేశారన్నారు. పాలకుల తప్పిదాల వల్ల కొన్ని కులాలను మాత్రమే బీసీఏ లో చేర్చి, తెలంగాణలో 80 శాతం మత్స్య వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ముదిరాజ్‌లను బీసీ కలిపి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.

నాటి నుంచి తమను బీసీగె ఏలో చేర్చాలని పోరాడినట్టు చెప్పారు. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి 2009 ఫిబ్రవరి 19న జీవో నంబర్ 15 ద్వారా బీసీ జాబితా నుంచి బీసీ తెచ్చారన్నారు. అయితే బీసీ కొన్ని కులాలు జీవో 15పై హైకోర్టును ఆశ్రయించి, రిట్ పిటిషన్ ద్వారా కొట్టివేయించారని గుర్తుచేశారు.

జీవో 15 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామన్నారు. సుప్రీంకోర్టు లో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈ సమస్యను రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం  ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఆ ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీ  కమిషన్ తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.వెయ్యికోట్లు కేటాయించాలి

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన పూర్తి చేసి, రిజర్వేషన్లను పెంచాలని కోరారు. బీసీ డీ జాబితా నుంచి బీసీ| చేర్చాలని విజ్ఞప్తిచేశారు. ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం ఫైనా న్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయ డం హర్షణీయమని, దానికి కేటాయించిన రూ.50 కోట్లు సరిపోవని.. మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు.

చెరువులు కుంటలపై, మత్స్యవృత్తిపై తెనుగు, ముత్తరాశి, ముదిరాజ్, బెస్త, గంగపుత్ర, గూండ్ల కులాలకు మాత్రమే హక్కులు ఉండేవిధంగా చట్టపరమైన హక్కులు కల్పించేలా ఆదేశాలు జారీచేయాలన్నారు. వివిధ జిల్లాల్లో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కోరారు. మత్స్య అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్య కోఆపరేటివ్ రాష్ట్ర ఫెడరేషన్‌కు వెంటనే ఎన్నికలు జరిపి చైర్మన్, పాలకమండలిని కొనసాగించాలని విజ్ఞప్తిచేశారు.