calender_icon.png 26 January, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడుపునిండుగా.. పోషకాలు మెండుగా!

10-08-2024 12:00:00 AM

ఈతరం తల్లిదండ్రుల :

ఆలోచనలన్నీ పిల్లల చుట్టే తిరుగుతుంటాయి. పిల్లల స్టడీస్‌తో పాటు వాళ్లకు ఏయే ఆహారం ఇవ్వాలని తెగ ఆలోచిస్తుంటారు. చాలామంది పిల్లలు ఎర్లీ మార్నింగ్ హడావిడిగా పాలు తాగేసి స్కూళ్లకు పరుగులు తీస్తుంటారు. అందుకే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి ఏయేం పెట్టాలి అన్నది తల్లులను వేధించే పెద్ద ప్రశ్న. అయితే పిల్లలకు ఏయే టైంలో ఫుడ్ ఇవ్వాలి? ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? అనే విషయాలు చాలామందికి తెలియవు. అలాంటివాళ్ల కోసం పూర్తి మెనూను అందిస్తున్నాం.. అవేంటో తెలుసుకోండి.

హెల్దీ బ్రేక్ ఫాస్ట్

ఈ జనరేషన్ పేరెంట్స్ లేస్తూనే ఆఫీసులకు.. వస్తూనే వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంటున్నారు. అందుకే చాలామంది తల్లులు పిల్లలకు సరైన బ్రేక్ ఫాస్ట్ ఇవ్వడం లేదని హెల్త్ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. సరైన సమయంలో కూడా ఇవ్వడం లేదని సూచించాయి. అందుకే పిల్లలకు కచ్చితంగా ఉదయం 7.30 నుంచి 9 గంటలకు వరకు బ్రేక్ ఫాస్ట్ ఇవ్వాలి. రాత్రి చాలాసేపు పడుకోవడం వల్ల పొద్దున లేచేసరికి  ఖాళీ కడుపుతో ఉంటారు. కచ్చితంగా మార్నింగ్  వీలైనంత త్వరగా టిఫన్ పెడితే బాగుంటందంటారు పిల్లల డైటీషియన్లు. ముఖ్యంగా ఇడ్లీ, దోశ, కిచిడీ వంటివి తినిపించాలి. పూరి, బజ్జి లాంటి ఫుడ్ అసలు ఇవ్వకూడదు. దోశ, ఇడ్లీ లాంటివి ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు. 

పోషకాల లంచ్..

పిల్లలకు లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం కూడా బిగ్ టాస్క్ లాంటిది. ఎందుకంటే పిల్లలు ప్రతిరోజూ కొత్త ఫుడ్ తినాలని గోల చేస్తుంటారు. కానీ బిజీ లైఫ్ వల్ల తల్లులకు సాధ్యంకాకపోవచ్చు. అయినప్పటికీ పిల్లలు సంతోషంగా తినేందుకు హెల్దీ లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్ బాక్స్ లో వెజిటేబుల్ రైస్, దాల్ రైస్, కార్డ్ రైస్ లాంటివి ఇస్తే బాగుటుంది. అయితే కొంతమంది పిల్లలు ఆకర్షణీయంగా కనిపించే ఫుడ్ తినడానికి ఇష్టం చూపుతారు. అలాంటివాళ్లకు క్యారట్, బీట్‌రూట్‌తో చపాతీలు చేసి పెడితే ఇష్టంగా తింటారు. బీట్‌రూట్, క్యారెట్ లాంటివాటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎదిగే పిల్లలకు ఆరోగ్యకరమైన పోషకాలు.

ఎక్కువగా కూరగాయలతో చేసిన ఫుడ్ ఇస్తే పిల్లలకు మరిన్ని పోషకాలు అందుతాయి. అయితే కొంతమంది పిల్లలకు నూడుల్స్ అంటే చాలా ఇష్టం. దీనివల్లే చాలా మంది పిల్లలు భోజనంలో నూడుల్స్ కావాలని పట్టుబడుతుంటారు. కానీ నూడుల్స్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇవి ఉదయం చేయడం వల్ల మధ్యాహ్నం వరకు చల్లబడుతుంది. అలాగే వీటి టేస్ట్ కూడా మారుతుంది. అందుకే మధ్యాహ్న భోజనంలో నూడుల్స్ ను అస్సలు ఇవ్వకండి. ఘాటైన వాసన వచ్చే కూరగాయలను ఇవ్వకపోవడమే మంచిది. అయితే లంచ్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా మధ్యాహ్నాం 12.30  నుంచి 1.30 గంటలలోపు ఇస్తే బాగుంటుంది. 

డిన్నర్ ఇలా..

పిల్లలకు డిన్నర్ కూడా చాలా ముఖ్యం. నాన్ వెజ్, ఎగ్ రైస్, చికెన్ రైస్ తో పాటు చేపలు, పులావ్, రైస్ తో కూడిన ఆకుకూరలు ఇస్తే బాగుంటుంది. పిల్లలకు పోషకాలు మస్ట్ కాబట్టి నాన్ వెజ్ కూడా ఇవ్వొచ్చు. అయితే రాత్రి పూట డీప్ ఫ్రై వంటకాలు అస్సలు ఇవ్వకూడదు. చికెన్ ఫ్రై, పన్నీరు ఐటమ్స్ కు దూరంగా ఉంచాలి. వీటి వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు తలెత్తుతాయి. అయితే చాలామంది తమ పిల్లలకు బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటి ఫుడ్ ఐటమ్స్ ఇస్తుంటారు. దీంతో తిన్న ఆహారం అజీర్ణం కాదు. హైప్రోటిన్ ఫుడ్‌కు కూడా దూరంగా ఉంచాలి.

అయితే వారంలో కనీసం నాలుగు రోజులు ఆకుకూరలతో భోజనం అందిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పప్పు దినుసులతో కూడిన ఫుడ్ ను ఇస్తే శారీరక ఎదుగుదల ఉంటుంది. నిపుణుల ప్రకారం డిన్నర్ 7 గంట నుంచి 8.30 గంటల వరకు ఎప్పుడైనా ఇవ్వొచ్చు. అయితే కొంతమంది పిల్లలు రాత్రి 7 గంటలకే డిన్నర్ చేయడం వల్ల మళ్లీ ఆకలి వేస్తుంది. అలాంటివాళ్లకు పాలు ఇవ్వొచ్చు. అయితే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, లంచ్ తో పాటు స్నాక్స్ కూడా ముఖ్యమే. డ్రైపూట్స్, అటుకులు, పోహా, మజ్జిగ లాంటివి ఇవ్వొచ్చు. 

పిల్లలకు పోషకాలు మస్ట్

పెరుగుతున్న పిల్లలకు పోషకాలు కచ్చితంగా అవసరం. ఎందుకంటే పిల్లలకు ఫుడ్ ప్రాపర్ గా డైజెస్ట్ కాదు. స్కూల్ లో గంటలతరబడి కూర్చోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి కచ్చితంగా హెల్దీ ఫుడ్ అవసరం. హెల్దీ ఫుడ్ ఇస్తేనే పిల్లల్లో ఇమ్యూనిటీ బాగుంటుంది. డ్రైప్రూట్స్, నట్స్ కచ్చితంగా ఇవ్వాలి. ఇక క్రమం తప్పకుండా పెరుగు ఇవ్వడం కూడా చెడు బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. పిల్లలకు హెవీ ఫుడ్ ఇస్తే లేజీ అవుతారు. అంతేకాదు.. త్వరగా అలిసిపోతారు. కూరగాయాలతో కూడిన ఫుడ్ ఇవ్వడం వల్ల గ్యాస్ ప్రాబం లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇక నీళ్లు తాగితే వ్యర్థాలు బయటకు పోతాయి. 

 సైదా సన, డైటిషీయన్

ఎప్పుడు తినాలి

ఏం తినాలి?

బ్రేక్ ఫాస్ట్

ఇవ్వాల్సినవి

* రోటి

* ఉప్మా

* దోశ

* ఇడ్లీ సాంబార్

* సాబుదాన ఉప్మా

ఇవ్వకూడనివి

* బోండా

* వడ

* పూరి

* పాస్తా

* మైదా ఫుడ్స్

లంచ్ 

ఇవ్వాల్సినవి

* వెజ్ టేబుల్  రైస్

* పులావ్

* వెజ్ బిర్యానీ

* రోటీ లేదా పుల్కా

* కార్డ్ రైస్

* దాల్ రైస్

ఇవ్వకూడనివి

* వంకాయ మసాలా

* చికెన్ మసాలా

* బెండీ ఫ్రై

* ఆలూ ఫ్రై

డిన్నర్ 

ఇవ్వాల్సినవి

* నాన్ వెజ్

* ఎగ్ రైస్ 

* చేపలు

* పులావ్

* పాలు

* రైస్‌తో కలిపిన    పాలకూర 

ఇవ్వకూడనివి

* మసాల ఫుడ్స్ 

* ఆయిల్ ఫుడ్స్