calender_icon.png 11 January, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్తి సేవలు త్వరలో అందిస్తాం

11-01-2025 12:00:00 AM

 గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ 

గజ్వేల్, జనవరి 10 :  గజ్వేల్  ప్రభుత్వ జిల్లా దవాఖాన లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, మాతా శిశు ఆసుపత్రిలో  త్వరలో పూర్తి సేవలు అందుబాటులోకి రానున్నట్లు  సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. శుక్రవారం ఆమె కార్యాలయంలో స్థానిక విలేకరులతో  మాట్లాడారు. గజ్వేల్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలు అందు బాటులో ఉన్నాయన్నారు.

దవఖానలో ప్రతి నెల 400కు పైగా  ప్రసవాలను నిర్వహిస్తు న్నామని, వీటిలో ఎక్కువ సాధారణ ప్రసవాలే ఉంటున్నాయన్నారు.  కంటి ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, మోకాలు ఆపరేషన్లు, గైనకాలజీ, అల్సర్, ఫైల్స్, ఫిస్టులా, హెర్నియా తదితర ఆపరేషన్లన్నీ  అందుబాటులో ఉన్నాయన్నారు. షుగర్, బిపి పేషెంట్లకు ప్రతిరోజు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ముఖ్యంగా ప్రసవాలు, చిన్నపిల్లల వైద్యం విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రభుత్వ దావకానాల కంటే ఉత్తమ సేవలందిస్తున్నట్లు తెలిపారు.  ప్రతి శుక్రవారం స్త్రీ నిపుణుల వైద్యం ప్రత్యేక వైద్య సేవలు (ఎన్ సి డి క్లినిక్), ట్యూబేక్టమి ఆపరేషన్లు  చేస్తున్నట్లు తెలిపారు.

ఇంకా డయాలసిస్ డయాగ్నొస్టిక్ సెంటర్, రేడియాలజీ సేవలు కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకొని   ఉచిత వైద్య సేవలను పొందాలన్నారు.  డాక్టర్. సాయి కిరణ్, డాక్టర్ మంజుల పాల్గొన్నారు.  ఆమె వెంట  వైద్యులు డాక్టర్ మంజుల, డాక్టర్ సాయికిరణ్ ఉన్నారు.