డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరావు
రంగారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పూర్తి నివేదిక సిద్ధం చేస్తామని డెడికెటేడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరావు స్పష్టం చేశారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం కమిషన్ కార్యదర్శి సైదులుతో కలిసి బహిరంగ విచారణలో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసమే తాము అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. విచారణలో బీసీ ఫెడరేషన్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్, విశ్వకర్మ సంఘం నుంచి బ్రహ్మచారి నెల్వేజ్ సెల్వాచారి, ఆదిమూలం వెంకటాచారి, పూసల సంఘం నుంచి సదానందం, పగడాల యాదయ్య, వడ్డెర సంఘం నుంచి మారెయ్య, రవి, మేదెర సంఘం నుంచి గంగాధర్, ఉప్పర సంఘం సతీశ్‌సాగర్, మత్స్యకారుల సంఘం నుంచి గెరెంకల నర్సింహ, మేదర సం ఘం నుంచి అందూరి శివ, ఎంబీసీ సంఘం నుం చి నాగేంద్ర, రజక సంఘం నుంచి రాజ్‌కుమార్ కమిషన్‌కు వినతులు, అభిప్రాయాలు అందించారు. సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు