calender_icon.png 10 January, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ ఆధారాలు లేకున్నా పూర్తి స్థాయి వైద్యం అందిస్తా: ఎమ్మెల్యే జారె

03-01-2025 11:02:05 PM

రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ లేకున్నా వైద్య సేవలు..

ములకలపల్లి: ఆరోగ్య విషయంలో ఏ ఆధారాలు లేకున్నా ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తామని స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ పేర్కొన్నారు. ములకలపల్లి రైతు వేదికలో శుక్రవారం 36 మంది బాధితులకు రూ. 12 లక్షలు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో తనను సంప్రదిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా వైద్య సేవలు అందించడానికి తాను కృషి చేస్తానని ఆయన అన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ ఏ పనైనా చేయగలరని, అందరూ ఆరోగ్యంగా ఉండటమే తాను కోరుకుంటున్నాని అన్నారు.

కాంగ్రెస్ వాళ్లకే సీఎంఆర్ చెక్కులు అందిస్తా అనే అపోహ వీడి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో తనను సంప్రదిస్తే అందరికీ వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తానని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తానని అన్నారు. అనంతరం సుబ్బన్నపల్లిలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, కారం సుధీర్, కుంజా రవి, సున్నం సుధాకర్, ఆర్‌ఐ సత్యావతి, తిరుపతి రెడ్డి, ఎస్సై రాజశేఖర్, సురభి రాజేష్, సుమిత్ తదితరులు ఉన్నారు.