calender_icon.png 13 January, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లద్నాపూర్ సింగరేణి భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం

01-08-2024 11:55:13 AM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): లద్నాపూర్ సింగరేణి భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని రాష్ట్ర ఐటి,  భారీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో మంత్రిని రామగిరి మండలంలోని లద్నాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాదులోని మంత్రి శ్రీధర్ బాబు నివాసంలో గ్రామంలోని సమస్యలు ఆర్ అండ్ ఆర్ సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. మంత్రి  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంపై సింగరేణి ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనం రామచంద్ర రావు, సర్పంచ్ బీవీ స్వామి గౌడ్, మంథని అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్,సీనియర్ నాయకులు తోగారి లింగయ్య నాయకులు మెడగొని రాంచందర్, పొన్నం సత్యనారాయణ గౌడ్, నరివెద్ది శ్రీనివాస్, ఎస్ కే జమీల్ తదితరులు పాల్గొన్నారు.