calender_icon.png 13 October, 2024 | 4:47 PM

రెండు రోజుల్లో .. నిండుకుండల్లా

03-09-2024 04:01:44 AM

  1. ఎడతెరిపి లేని వానలకు ప్రాజెక్టులకు జలకళ 
  2. గోదావరి, కృష్ణా బేసిన్లలో అన్ని జలాశయాలకు వరద 
  3. ఎస్సారెస్పీ 40 గేట్లు ఎత్తి 2.5 లక్షల క్యూసెక్కులు దిగువకు 
  4. శ్రీశైలం, సాగర్‌కు వచ్చిన నీరు వచ్చినట్టే నదిలోకి.. 
  5. రిజర్వాయర్లు నిండటంతో ఆయకట్టు రైతుల ఆనందం

నిజామాబాద్/కామారెడ్డి(విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్ర నుంచి భారీగా వరద ప్రవాహం వస్తున్నది. 40 గే ట్లు ఎత్తి 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 72. 990 టీఎంసీల నీరు నిల్వఉంది. రామడుగు ప్రాజెక్ట్ కట్టపై నుంచి నీరు పొంగు పొర్లుతోంది. ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1778.3 అడుగులు కాగా, సోమవారం ఉదయానికి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అలీసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1299.6 అడుగులు కాగా సోమవారం ఉదయానికి ప్రాజెక్ట్‌లో 1296. 11 అడుగుల వద్ద నీరు నిల్వఉంది. పోచారం ప్రాజెక్ట్, ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వస్తున్నా పూర్తిస్థాయిలో నిండలేదు. 

జూరాలకు వరద..

వనపర్తి (విజయక్రాంతి): ఎగువ ప్రాంతమైన నారాయణపూర్ డ్యాం నుంచి 3 లక్షల 35 వేల క్యూసెక్యులు వరద రావడంతో జూరాల జలాశయం నిండుకుండలా మారింది.  45 గేట్లు ఎత్తి దిగువకు 3 లక్షల 18 వేల 574 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. నీటి నిల్వ సామర్థ్యం 318.65 అడుగులకు గాను 317.760 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

శ్రీశైలానికి వరద ఉధృతి

నాగర్‌కర్నూల్(విజయక్రాంతి): శ్రీశైలం జలాశయానికి వరద తాకిడి మరింత పెరుగుతోంది. ఎగువ జూరాల నుంచి 5,02,24 4 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 211.95 టిఎంసీలు 884.40 అడుగులమేర నీటి నిల్వ ఉంది.

నాగార్జున సాగర్‌కు తగ్గని వరద పోటు 

నల్లగొండ(విజయక్రాంతి): నాగార్జున సా గర్‌కు ఎగువ నుంచి వరద రాక ఏమాత్రం తగ్గలేదు. రిజర్వాయర్‌లోకి 5 లక్షల 30 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తోంది. అధికారులు ప్రాజెక్టు 26 క్రస్టుగేట్లను బార్లా తెరచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం586.80 అడుగులు ( 304 .4680 టీఎంసీలు)గా ఉంది. 

ఉరకలెత్తుతున్న మూసీ 

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ రిజర్వాయర్‌కు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టులోకి 7,549 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వ స్తుండటం.. ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండటంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 క్రస్టుగేట్లను 4 అడుగుల మేర ఎత్తి 17,052 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6 గంట ల తరువాత క్రస్టుగేట్ల ఎత్తు కుదించి అవుట్ ఫ్లోను 6200 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.40 టీఎంసీలుకాగా ప్రస్తుతం 3.58 టీఎంసీలు ఉంది. 

మత్తడి దూకుతున్న డిండి ప్రాజెక్టు

నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు మత్తడి పోస్తోంది. ఎగు వన మూడు రోజులుగా కురుస్తున్న భారీగా వర్షాలకు కృష్ణానదికి ఉపనదైన దుందుభీ వాగుతోపాటు వాగులు, వంకలు పొంగడం తో ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు (2.46 టీఎంసీలు) కాగా సోమవారం పూర్తిస్థాయికి చేరింది. 

నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు

మంచిర్యాల(విజయక్రాంతి): ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో అధికంగా వస్తుండటంతో నిండు కుండలా మారింది. అధికారులు ఆదివారం 62గేట్లలో 33 గేట్లు ఎత్తి నీటిని కింది కి వదిలారు. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీ ఎంసీలు కాగా ప్రస్తుతం 14.8731 టీఎంసీల నీరు ఉంది. 

కడెం ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత

నిర్మల్(విజయక్రాంతి): జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వర రావడం తో 18 గేట్లను ఎత్తి దిగువకు అంతే నీటిని వ దులుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టు నిండటంతో 4 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు.గడ్డెన్న వాగుకు 30 వేల క్యూసెక్యుల నీరు వస్తుండగా అంతే మొ త్తంగా 3 గేట్ల ద్వారా వదులుతున్నారు. బాస ర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పుష్కర ఘాట్ వద్ద భక్తులకు నిషేధం విధించారు. 

కోల్‌సాగర్ 13 గేట్లు ఎత్తివేత 

మహబూబ్‌నగర్(విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోయిల్ పాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నా రు. 13 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నా రు. కౌకుంట్ల, ఇస్రంపల్లి ప్రధాన రహదారిపై రోడ్డు పొంగి పొర్లింది. 

ప్రకాశం నుంచి రికార్డు స్థాయిలో 

నల్లగొండ(విజయక్రాంతి): ఏపీలోని ప్రకా శం బ్యారేజీ నుంచి సోమవారం రికార్డు స్థాయిలో నీటి విడుదల కొనసాగింది. బ్యారే జీ 70 గేట్లను ఎత్తి 11 లక్షల 43 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. 1852 మధ్య సర్ ఆర్థర్ కాటన్ నేతృత్వంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రప్రథమ ప్రాజెక్టు విజయవాడ ఆనకట్ట. 1903లో అత్యధికంగా 10 లక్షల 61వేల క్యూసెక్కుల ప్రవాహం విడుదల చేశారు. ఆ తరువాత 1952 చేపట్టిన పునర్నిర్మాణంలో గరిష్ఠంగా 11 లక్షల 90 వేల క్యూసెక్కుల ప్రవాహం వెళ్లేలా ప్రకా శం బ్యారేజీని డిజైన్ చేశారు. 2009 అక్టోబర్ వరదల సమయంలో బ్యారేజీ నుంచి గరిష్ఠంగా 10 లక్షల 90 వేల క్యూసెక్కుల ప్రవా హం వెళ్లింది. ప్రస్తుతం ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 11 లక్షల 43 వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు చేరింది. రాత్రికి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఎల్‌ఎండీ నీటిమట్టం  ఎల్‌ఎండీకి పెరిగిన ఇన్‌ఫ్లో

కరీంనగర్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు వచ్చి చేరుతుండటంతో కరీంనగర్ సమీపంలోని ఎల్ ఎండీలో నీటిమట్టం పెరిగింది. ఎల్‌ఎండీ పూర్తిస్థాయి సామర్థ్యం 24.03 టీఎంసీలుకాగా ప్రస్తుతం 15.419 టీఎంసీలకు చేరు కుంది. ఇన్‌ఫ్లో 18,606 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో 271 క్యూసెక్కులు. మిడ్ మానేరులో నీటి సామర్థ్యం 27.5 టీఎంసీలుకాగా ప్రస్తుతం 18.31 టీఎంసీల నీటిమట్టం ఉంది. 

కడెం ప్రాజెక్టు ఆధునీకరణకు చర్యలు

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

నిర్మల్ (విజయక్రాంతి): వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం రాత్రి నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును సందర్శించా రు. కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్ల క్ష్యం చేసిందని ఆరోపించారు. కడెం ప్రా జెక్టు ఆధునీకరణకు తమ ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించిందన్నారు. కడె ం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి వెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఉన్నారు.