ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 4.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైందని సీబీఆర్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో లీజింగ్ 3.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇక ఆఫీస్ స్పేస్ నిర్మాణం సైతం అదే స్థాయిలో ఉంది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, విజయక్రాంతి
జనవరి- మధ్య కాలంలో ఆఫీస్ స్పేస్ నిర్మాణం 4.6 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. త్రైమాసికాలవారీగా చూస్తే ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2.3 మిలియన్ చదరపు అడుగులు నమోదు కాగా, నిర్మాణం 2.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. లైఫ్ సెన్సైస్ 27 శాతం, రీసెర్చ్, కన్సల్టింగ్, అనలిటిక్స్ 27 శాతం, టెక్నాలజీ సంస్థలు 17 శాతం మేర లీజింగ్‌లో వాటా కలిగి ఉన్నాయని సీబీఆర్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఏప్రిల్ ఆఫీస్ స్పేస్ టేకప్ అనేది చిన్న పరిమాణాల (50 వేల చదరపు అడుగుల కంటే తక్కువ) లావాదేవీల ద్వారానే ఎక్కువగా జరిగాయి. పాన్ ఇండియా ప్రాతిపదికన స్థూల ఆఫీస్ లీజింగ్ 328 మిలియన్ చదరపు అడుగులకు చేరడంతో ఆఫీస్ చాలా బలోపేతమైంది. మొత్తం మీద జనవరి కాలంలో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 14 శాతం మేర ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో పెరుగుదల నమోదైంది. ఇదే సమయంలో నిర్మాణం 221 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
నగరాలవారీగా పరిశీలిస్తే..
నగరాలవారీగా పరిశీలిస్తే జనవరి జూన్ మధ్య కాలంలో మొత్తం లీజింగ్‌లో 25 శాతంతో బెంగళూరు తొలిస్థానంలో ఉంది. ఢిల్లీ 16 శాతం, చెన్ను -14 శాతం, పుణె, హైదరాబాద్ 13 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ఇక నిర్మాణం విషయానికి వస్తే బెంగళూరు, హైదరాబాద్, ముంబై కలిసి 69 శాతం వాటా కలిగి ఉండటం విశేషం. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో 28 శాతం వాటాతో టెక్నాలజీ కంపెనీలు ముందున్నాయి. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు 16 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు 15 శాతం, ఇంజినీరింగ్, తయారీ సంస్థలు 9 శాతం,
పరిశోధన, కన్సల్టింగ్, అనలిటిక్స్ సంస్థ 8 శాతం వాటాతో ఉన్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన ఏప్రిల్- జూన్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 18 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 27 శాతం అధికం. ఈ త్రైమాసికంలో బెంగళూరు, పుణె, చెన్ను కలిసి 57 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2024 మొదటి అర్ధభాగంలో లైఫ్ సెన్సైస్, టెక్, రీసెర్చ్ సంస్థలు ఆఫీన్ స్పేస్‌ను అధికంగా టేకప్ చేసినట్టు సీబీఆర్ ఇండియా చైర్మన్ అండ్ సీఈవో తెలిపారు. నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, స్థిరమైన ప్రభుత్వంతో మనదేశంలో ఆఫీస్ రంగం అప్రతిహతంగా దూసుకెళ్తోందని ఆయన వ్యాఖ్యానించారు.